రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే, ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
‘రణబాలి’ చిత్ర టీజర్‌ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ టీజర్‌తో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The legend of the cursed land rises 🔥#RanabaaliTeaser out on September 9th ❤🔥#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th@TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn @MythriOfficial #ArnoldVosloo @AjayAtulOnline @nirav_dop… pic.twitter.com/k8537iCKPM
— Mythri Movie Makers (@MythriOfficial) September 7, 2026


