“గామి” ట్రైలర్ టెస్ట్ స్క్రీనింగ్ ఇప్పుడే పూర్తయ్యింది – విశ్వక్ సేన్!

“గామి” ట్రైలర్ టెస్ట్ స్క్రీనింగ్ ఇప్పుడే పూర్తయ్యింది – విశ్వక్ సేన్!

Published on Feb 27, 2024 10:04 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో, విద్యాధర్ కాగిత దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం గామి. మార్చి 8, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 29 వ తేదీన ప్రసాద్ మల్టీప్లెక్స్ లోని PCX స్క్రీన్ లో సాయంత్రం 4:00 గంటలకి ప్రదర్శించనున్నారు.

ఈ ట్రైలర్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ టెస్ట్ స్క్రీనింగ్ పూర్తి అయిన విషయాన్ని విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. మీకు అందించదానికి సంతోషిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఈ లీపు సంవత్సరము నాకు, తెలుగు సినిమాకి ఎంతో ప్రత్యేకం అని తెలిపారు. చాందినీ చౌదరి, MG అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు