షూటింగ్స్ ని బాగా మిస్సవుతున్న యంగ్ హీరో..!

Published on May 27, 2020 12:02 am IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ తన సినిమాకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన గత చిత్రం ఫలక్ నుమా దాస్ మూవీలో ఓ సాంగ్ షూటింగ్ సమయంలో తీసిన ఆ వీడియో క్లిప్ విశ్వక్ పంచుకోవడం వెనుక కారణం, ఆయన షూటింగ్స్ బాగా మిస్సవుతున్నాడని తెలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా షూటింగ్స్ కి బ్రేక్ పడింది . దీనితో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్స్ కి ఏమి తోయడం లేదు.

ప్రస్తుతం విశ్వక్ పాగల్ అనే మూవీలో నటిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ మూవీకి నరేష్ కుప్పిలి అనే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఏడాది విశ్వక్ సేన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ పాజిటివ్ తెచ్చుకుంది. పోలీస్ గా విశ్వక్ నటించిన ఈ మూవీని హీరో నాని నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More