“గామి” నోలన్ సినిమా రేంజ్ లో ఉంటుందంటున్న విశ్వక్

“గామి” నోలన్ సినిమా రేంజ్ లో ఉంటుందంటున్న విశ్వక్

Published on Mar 3, 2024 10:07 AM IST

ప్రస్తుతం మూవీ లవర్స్ అందరి దృష్టి ఎంతగానో ఆకర్షించిన టాలీవుడ్ అవైటెడ్ చిత్రం “గామి”. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ లో అనేకమంది యంగ్ టాలెంట్ తో దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన భారీ విజువల్ ట్రీట్ చిత్రమే “గామి”. మరి రీసెంట్ ట్రైలర్ తో అందరి మైండ్ బ్లాక్ చేసిన ఈ సినిమా ఎప్పుడు చూద్దామా అని పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రం రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా అఘోర విశ్వక్ సేన్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని తాను ఏకంగా హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమా రేంజ్ లో పోలుస్తున్నాడు. గామి నోలన్ తాలూకా డంకిర్క్ తరహాలో ఉంటుంది అని తాను తెలిపాడు.

దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా పట్ల తాను అయితే చాలానే కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. మరి చూడాలి ఏమవుతుంది అనేది. అది తెలియాలి అంటే ఈ మార్చ్ 8 వరకు ఆగితే సరిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు