కొన్ని సంవత్సరాల తరువాత నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి – విశ్వక్ సేన్!

కొన్ని సంవత్సరాల తరువాత నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి – విశ్వక్ సేన్!

Published on May 29, 2024 12:04 AM IST


యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం మే 31, 2024 న థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. మేకర్స్ ఈ సందర్భం గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. హీరో విశ్వక్ సేన్ ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ చిత్రం షూటింగ్ సమయంలో లారీ నుండి రోడ్ పై పడినప్పుడు తన మోకాలి కి దెబ్బ తగిలింది అని అన్నారు. ఆ విషయం తెలిసిన బాలయ్య తనకి కాల్ చేసి ఆందోళన చెందిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక బాలయ్య బాధపడిన విషయాన్ని తెలిపారు. ఆ టైమ్ లో కొన్ని సంవత్సరాల తరువాత తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అని విశ్వక్ అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

అంతేకాక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కొత్త బాటిల్ లో పాత వైన్ లాంటిది అని బాలయ్య చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం ను నిర్మించిన నాగ వంశీ బెస్ట్ ప్రొడ్యూసర్ అని, తను చేసిన అన్ని చిత్రాల్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక డైరెక్టర్ కృష్ణ చైతన్య పై, హీరోయిన్స్ నేహ శెట్టి, అంజలి లపై ప్రశంసల వర్షం కురిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు