లేటెస్ట్…విశ్వక్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ డీటైల్స్ ఇవే!

లేటెస్ట్…విశ్వక్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ డీటైల్స్ ఇవే!

Published on May 22, 2024 6:11 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak sen) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of godavari). ఈ చిత్రం గతేడాది థియేటర్ల లోకి రావాల్సి ఉండగా, వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో మేకర్స్ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి సంబంధించిన వివరాలను సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. మే 25, 2024 న హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద దేవి ధియేటర్ లో ట్రైలర్ ను లాంఛ్ చేయనున్నారు. సాయంత్రం 4:06 గంటలకు లాంఛ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు