విశ్వక్సేన్ ‘గామి’ టీజర్ రిలీజ్ అప్ డేట్

విశ్వక్సేన్ ‘గామి’ టీజర్ రిలీజ్ అప్ డేట్

Published on Feb 17, 2024 2:01 AM IST

యువ నటుడు విశ్వక్సేన్ తాజాగా నటిస్తున్న గామి మూవీ యొక్క మేకింగ్ వీడియో ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. విద్యాధర్ కాగిత తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

విషయం ఏమిటంటే, తాజాగా గామి టీజర్ రిలీజ్ పై మేకర్స్ అప్ డేట్ అందించారు. ఈ మూవీ టీజర్ ని రేపు ఉదయం 11 గం. 7 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా అనౌన్స్ చేసారు. ఇంకా ఈ మూవీలో ఎం జి అభినయ, మొహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పేడాడ కీలక పాత్రలు చేస్తున్నారు. అలానే గామి మూవీని మార్చి 8న గ్రాండ్ గా థియేటర్స్ లోకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు