తల అజిత్ నటించిన విశ్వాసం కోలీవుడ్లో 200కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈచిత్రాన్ని ఈ నెల 1న అదే టైటిల్ తో తెలుగులో విడుదలచేశారు. తెలుగు సినిమాలు కూడా పెద్దగా లేకపోవడంతో ఈ సినిమాకి భారీగానే థియేటర్లు దొరికాయి. అయితే బజ్ లేకపోవడం రివ్యూస్ కూడా నెగిటివ్ కూడా రావడంతో ఈ సినిమా మొదటి వారం 2.8కోట్ల గ్రాస్ అలాగే 1.30 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఈచిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2. 5కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్ లో అది సాధ్యం అయ్యేలా లేదు దాంతో ఈ చిత్రం కూడా అజిత్ కు తెలుగులో విజయాన్ని అందిచలేకపోయింది.
శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. ఇక ఈ చిత్రం కన్నడ లో జగమల్ల అనే టైటిల్ తో నిన్న విడుదలైయింది.
