125కోట్ల క్లబ్ లోకి విశ్వాసం !

125కోట్ల క్లబ్ లోకి విశ్వాసం !

Published on Jan 18, 2019 11:00 PM IST

తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ భారీ అంచనాలమధ్య ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం హావ కొనసాగిస్తుంది. కేవలం ఎనిమిది రోజుల్లో అక్కడ 125కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని చిత్రాన్ని డిస్ట్రీబ్యూట్ చేసిన కేజేఆర్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. అలాగే అజిత్ కెరీర్ లోనే ఇప్పటివరకు అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గా రికార్డు నెలకొల్పింది. పండుగ సీజన్ కి తోడు కోలీవుడ్ లో అజిత్ కు వున్న భారీ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ రేంజ్ లో వసూళ్లు సాధ్యమవుతున్నాయి. అంతేకాకుండా తమిళనాడులో రజినీకాంత్ పేట కంటే కూడా ఎక్కువ వసూళ్లను రాబడుతుంది ఈ చిత్రం.

శివ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నయన తార కథానాయికగా నటించగా జగపతి బాబు విలన్ పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రం యొక్క తెలుగు , కన్నడ వెర్షన్ ల విడుదలపై క్లారిటీ రావాల్సి వుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు