శివ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన చిత్రం ‘విశ్వాసం’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతమైన థియేటర్స్ విడుదల అయినప్పటికీ, సినిమా పై చాలా తక్కువ బజ్ ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. మొట్టమొదటి రెండు రోజుల్లో ఈ చిత్రం కేవలం 70 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది.
ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్, అలాగే తండ్రి కూతుర్ల మధ్య వచ్చే కొన్ని మంచి ఎమోషనల్ సన్నివేశాలు బాగా అలరించనప్పటికీ సినిమాలో ముఖ్యమైన కథనం నెమ్మదిగా సాగడం, ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను రూపొందించలేకపోవడం వంటి అంశాలు సినిమా పై బాగా ప్రభావం చేశాయి. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో నిలబడుతుందో చూడాలి.
