విశ్వాసం టీజర్ అప్డేట్ !

విశ్వాసం టీజర్ అప్డేట్ !

Published on Nov 21, 2018 1:44 AM IST

తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం యొక్క అప్డేట్స్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ గురువారం రోజున ఈ చిత్ర టీజర్ గురించి అప్డేట్ వెలుబడనుందని చెన్నై చిత్ర వర్గాల సమాచారం. శివ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అజిత్ డ్యూయెల్ రోల్ లో కనిపించనునున్నాడు. .

నయనతార కథానాయికగా నటించిన ఈచిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్నఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కానుకగా విడుదలకానుంది. ఇక ‘వివేగం’ తరువాత అజిత్ నటించిన ఈచిత్రంఫై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు