బిగ్ బాస్ కపుల్ క్రేజ్ పీక్స్ లో ఉందే..!

బిగ్ బాస్ కపుల్ క్రేజ్ పీక్స్ లో ఉందే..!

Published on Nov 25, 2019 8:40 PM IST

VARUN VITHIKA

మిగతా వారి సంగతేమో కానీ ఈ బిగ్ బాస్ సీజన్ స్టార్ కపుల్ వరుణ్ సందేశ్, వితిక షేరుకు బాగానే కలిసొచ్చింది. సక్సెస్ లు లేక మరుగున పడిపోయిన వీరిద్దరూ మళ్ళి లైమ్ లైట్ లోకి వచ్చారు. బయట అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్న ఈ కపుల్ కి అభిమానుల నుండి ఘనస్వాగతం అందుతుంది. వీరిని చూసేందుకు జనాలు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. కాగా నేడు హైదరాబాద్ పంజాగుట్ట నందు గల నెక్స్ట్ గలేరియా మాల్ నందు ఈ జంట సందడి చేశారు.

ఎల్ అండ్ టి సంస్థ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో వరుణ్ వితిక పాల్గొనడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున అక్కడి చేరుకున్నారు. వీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఈలలతో గోల చేశారు. వీరితో సెల్ఫీలు దిగడానికి అందరు పోటీపడ్డారు. ఊహించని విధంగా ఇంత క్రౌడ్ ఒక్కసారిగా పోటెత్తడంతో నిర్వాహకులకు వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. ఈ సంధర్భంగా తమపై అభిమానులు చూపిన ప్రేమకు వితిక మరియు వరుణ్ కృతజ్ఞలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు