బిగ్ బాస్ ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుందా?

బిగ్ బాస్ ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుందా?

Published on Sep 5, 2019 11:03 PM IST

ఎపిసోడ్స్ గడిచే కొద్ది బిగ్ బాస్ రసవత్తరంగా మారుతుంది.కఠినమైన టాస్కులతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పరీక్ష పెడుతున్నారు. ఈ టాస్కులలో విజయం కోసం ఒకరితో మరొకరు పోటీ పడే క్రమంలో ఇంటి సభ్యుల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయ్.

మిగతా వారి సంగతి ఎలా ఉన్నా, హౌస్ లోకి జంటగా ప్రవేశించిన వరుణ్, వితికాల తీరు ఆందోళ కలిగిస్తుంది.తరచుగా అనేక గొడవలు వారి మధ్య తలెత్తుతున్నాయి. అభిప్రాయ భేదాలు, మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి.వితిక వరుణ్ తో సన్నిహితం గా ఉండాలని కోరుకుంటుండగా, వరుణ్ మాత్రం బిగ్ బాస్ హౌస్ కావున ఆమెను దూరంగా పెడుతున్నాడు. దీని వలన వారిద్దరి మధ్య అశాంతి ఏర్పడుతుంది.

ఇది బిగ్ బాస్ హౌస్ గేమ్ లో భాగంగా ఇలా కావాలని చేస్తే పర్వాలేదు, కానీ అలా కాకుండా వీరి మధ్య జరుగుతున్న గొడవలు నిజమైతే, ఆ ప్రభావం వారి నిజ జీవితం పైన కూడా పడే ప్రమాదం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు