తన అవివేకమైన ట్వీట్ కి సారీ చెప్పిన వివేక్

Published on May 21, 2019 10:24 am IST

వివేక్ ఒబెరాయ్ సరదాగా ఐశ్వర్య రాయ్ పై చేసిన ఒక పోస్ట్ బాలీవుడ్లో ప్రకంపనలు రేపింది. ఐశ్వర్య రాయ్ కి గతంలో కొందరు వ్యక్తులతో ఉన్న సంబంధాలను ఆమె ప్రైవేట్ లైఫ్ ని ఎద్దేవా చేస్తున్నట్లుగా ఉన్న ఆ పోస్ట్ పై మహిళా సంఘాలతో పాటు, బాలీవుడ్ ప్రముఖులు వివేక్ పై దుమ్ముతిపోశారు.

సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో వివేక్ నేటి ఉదయం అసభ్యకరమైన ఆ పోస్ట్ ని డిలీట్ చేయడంతో పాటు, నా ఈ చర్య వలన బాధపడిన ప్రతి మహిళలకు నా క్షమాపణలు అని పోస్ట్ చేశారు . ప్రస్తుత పరిస్థితుల్లో “అడుసు తొక్కనేలా కాలుకాదుగనేలా” అనే సామెత కరెక్ట్ గా సరిపోతుంది . వివేక్ చేసిన ఈ పోస్ట్ దేశవ్యాప్తంగా అతని ప్రతిష్ఠను దిగజార్చింది.

సంబంధిత సమాచారం :

More