పిక్ టాక్ : గాడ్ ఆఫ్ మాసెస్‌తో వివేక్ ఆత్రేయ.. కాంబోను సెట్ చేస్తున్న నిర్మాత..?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ జూన్ 10న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, స్టార్స్ ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు దర్శకనిర్మాతలు బాలయ్యను కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్, దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇద్దరు బాలయ్యను కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్యకు బొకే అందించి వారు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, గతకొద్ది రోజులుగా బాలయ్యతో వివేక్ ఆత్రేయ త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ ఫోటోతో ఆ వార్తలు నిజమే అని అభిమానులు భావిస్తున్నారు. మరి నిజంగానే వివేక్ ఆత్రేయ బాలయ్యతో తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడా..? మైత్రీ రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడా..? అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Exit mobile version