‘స్పిరిట్’ నుంచి మాసివ్ అప్డేట్.. ఊహించని లుక్ లో వినయ విధేయ రామ విలన్

Spirit

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో చేస్తున్న భారీ యాక్షన్ చిత్రం “స్పిరిట్” (Spirit) కూడా ఒకటి. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ కూడా ఒక బ్లాస్ట్ కాగా ఈ సినిమా నుంచి నేడు ఓ సర్ప్రైజ్ అప్డేట్ ని అందిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఇక ఈ సాయంత్రం 5 గంటలకి ఈ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తనపై ఒక ఊహించిన లుక్ ని మేకర్స్ వదిలారు. మోస్ట్ పవర్ఫుల్ గా వివేక్ ఒబెరాయ్ ఇందులో కట్టి పట్టుకొని కనిపిస్తుండగా తన హెయిర్ స్టైల్ గాని మీసకట్టు చూస్తుంటే ఈ సినిమాలో తన రోల్ ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం అవుతుంది.

అసలు రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలో చూసిన వివేక్ ఇతనేనా అనే లెవల్లో తన మేకోవర్ ని మార్చేశారు సందీప్. దీనితో ఈ క్రేజీ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా భద్రకాళి పిక్చర్స్ మరియు తీ సిరీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version