సంక్రాంతి రోజున ‘వివిఆర్ అండ్ ఎఫ్ 2’ నైజాం కలెక్షన్స్ !

Published on Jan 16, 2019 11:43 pm IST

సంక్రాంతి పండుగ రోజున “వినయ విధేయ రామ”, “ఎఫ్2” నైజాంలో బాక్స్ ఆఫీసు వద్ద బాగానే సందడి చేసాయి. నైజాంలో విలేజీస్ తో పాటు మేజర్ టౌన్స్ లో థియేటర్స్ అన్ని ఫుల్ అయ్యాయి.

కాగా కలెక్షన్స్ విషయానికొస్తే, “వినయ విధేయ రామ” నైజాంలో సంక్రాంతి రోజున రూ .1.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అలాగే నైజాంలో ఐదు రోజులకు గానూ సుమారు 10.50 కోట్లు షేర్ ను వసూళ్లు చేసింది.

ఇక సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఎఫ్ 2 కూడా సంక్రాంతి రోజున రూ .1.92 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మొత్తం నాలుగు రోజులకు గానూ దాదాపు 7 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.

సంబంధిత సమాచారం :

X
More