వివిఆర్ మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి !

Published on Jan 12, 2019 11:20 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ భారీ అంచనాలు మధ్య నిన్న విడుదలైయింది. ఇక ఈ చిత్రానికి రివ్యూస్ తో పాటు టాక్ కూడా నెగిటివ్ గానే వచ్చింది. అయితే ఆ ఎఫెక్ట్ కలెక్షన్ల ఫై మాత్రం పడలేదు. ఊహించని విధంగా తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 26 కోట్ల షేర్ ను రాబట్టి షాక్ ఇచ్చింది. అలాగే టాలీవుడ్ లో బాహుబలి , అజ్ఞాతవాసి చిత్రాల తరువాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది.

అంతే కాకుండా సీడెడ్ లో బాహుబలి 2రికార్డు ను బద్దలుకొట్టింది. అక్కడ బాహుబలి2 రూ. 6కోట్ల షేర్ రాబట్టగా ఈచిత్రం రూ.7.20కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈచిత్రానికి పండుగ సెలవుల రూపంలో కలిసిరానుంది. మరి రానున్న రోజుల్లో బాక్సాఫిస్ వద్ద ఇదే జోరును కొనసాగిస్తుందో లేదో చూడాలి.

తెలంగాణ &ఏపీలో మొదటి రోజు ఏరియాల వారిగా కలెక్షన్ల వివరాలు

 

ఏరియా కలక్షన్స్
నైజాం 5.08 కోట్లు
సీడెడ్ 7.20 కోట్లు
నెల్లూరు 1.6 9కోట్లు
గుంటూరు 4.18 కోట్లు
కృష్ణా 1.59కోట్లు
పశ్చిమ గోదావరి 1. 83 కోట్లు
తూర్పు గోదావరి 2.05 కోట్లు
ఉత్తరాంధ్ర 2.45కోట్లు
ఏపీ, తెలంగాణ మొదటి రోజు షేర్ 26.07 కోట్లు

సంబంధిత సమాచారం :