గుంటూరు ,కృష్ణా, నెల్లూరు లో వివిఆర్ కలక్షన్స్ !

Published on Jan 13, 2019 11:20 am IST


భారీ అంచనాల నడుమ మొన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకుంది రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ. అయితే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక ఈసినిమా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో రెండవ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది.

గుంటూరు జిల్లాలో ఈ చిత్రం రెండవ రోజు 35.16లక్షల షేర్ ను రాబట్టి రెండు రోజులకుగాను 4.53కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. కృష్ణా జిల్లాలో రెండవ రోజు 36.32 లక్షల షేర్ ను రాబట్టి రెండు రోజుల్లో 1.95కోట్ల షేర్ ను వసూలు చేసింది. నెల్లూరు లో రెండవ రోజు 15.73 లక్షల షేర్ తో రెండు రోజుల్లో 1.84 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక సంక్రాంతి సెలవులు కూడా మొదలు కావడంతో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం వుంది.

సంబంధిత సమాచారం :

More