‘వివిఆర్’, ‘ఎఫ్2’, ‘ఎన్టీఆర్’ల కృష్ణా లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 17, 2019 11:25 am IST

ఈ సంక్రాతికి “వినయ విధేయ రామ”, “ఎఫ్2”, “ఎన్టీఆర్ కథానాయకుడు” ఈ మూడు సినిమాలు తెలుగు పెద్ద సినిమాలుగా విడుదలయ్యాయి. వీటిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టడంలో ‘ఎఫ్2’, ‘వినయ విధేయ రామ’ ముందు వరుసలో నిలవగా.. ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం మిగిలిన రెండు చిత్రాలు కంటే కలెక్షన్స్ ను రాబట్టడంలో కాస్త వెనుక బడింది.

కాగా కృష్ణా జిల్లా విషయానికొస్తే, బుధవారం నాడు ఎన్టీఆర్ కథానాయకుడు రూ. 9.86 లక్షల షేర్ ని రాబట్టాడు. దీంతో మొత్తం 8 రోజులకు గానూ 1.29 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ‘వినయ విధేయ రామ’ విషయానికొస్తే కృష్ణా జిల్లాలో బుధవారం రూ. 34.42 లక్షల షేర్ ని వసూలు చేసింది. దీంతో మొత్తం 6 రోజులకు గానూ కృష్ణా జిల్లాలో రూ. 3.25 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

అలాగే ఎఫ్2 బుధవారం నాడు రూ .53.82 లక్షల షేర్ వసూలు చేయగా, ఐదు రోజులకు గానూ కృష్ణా జిల్లాలో 2.30 కోట్లు షేర్ వసూలు చేసింది.

సంబంధిత సమాచారం :

X
More