లుక్స్ తోనే అంచనాలు పెంచుతున్న చరణ్ !

లుక్స్ తోనే అంచనాలు పెంచుతున్న చరణ్ !

Published on Jan 2, 2019 3:59 PM IST


మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రం జనవరి 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో చిత్రబృందం ప్రొమోషన్ లో భాగంగా సినిమాలోని రామ్ చరణ్ కి సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేస్తోంది. ఈ రోజు కూడా రామ్ చరణ్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ చాలా కొత్తగా పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

కాగా సినిమా పోస్టర్సే ఇలా ఉంటే, ఇక సినిమా ఎలా ఉండబోతుందో అని మెగా అభిమానులు ఏంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు