‘వివిఆర్’ విడుదల తేదీ ఫిక్స్ అయినట్లేనా ?

‘వివిఆర్’ విడుదల తేదీ ఫిక్స్ అయినట్లేనా ?

Published on Nov 17, 2018 6:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం ‘వినయ విధేయ రామ’ ప్రస్తుతం సాంగ్స్ చిత్రీకరణను జరుపుకుంటుంది. అతి త్వరలో ఈచిత్రం యొక్క షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈచిత్రం యొక్క విడుదల తేదీ ఫై క్లారిటీ వచ్చిందట. వచ్చే ఏడాది జనవరి 10న యూఎస్ఎ లో ఈచిత్ర ప్రీమియర్ షోస్ స్టార్ట్ కానున్నాయని సమాచారం. దాంతో ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న విడుదలకానుందని తెలుస్తుంది. అయితే ఈవిడుదల తేదీ ఫై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ , స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దే వి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డివివి నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రం ఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు