‘వివిఆర్’ టీజర్ కొత్త రికార్డు సృష్టించింది !

‘వివిఆర్’ టీజర్ కొత్త రికార్డు సృష్టించింది !

Published on Nov 10, 2018 11:22 AM IST

రామ్ చరణ్ నటిస్తున్న’వినయ విధేయ రామ’ చిత్రం యొక్క టీజర్ నిన్న విడుదలై వ్యూస్ పరంగా కొత్త రికార్డును నెలకొల్పింది. 24గంటల్లో ఈ టీజర్ కోటి 51లక్షల డిజిటల్ వ్యూస్ ను రాబట్టింది. తెలుగులో కేవలం ఒక్క రోజులోనే ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ వ్యూస్ ను రాబట్టిన టీజర్ కావడం విశేషం.

పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ టీజర్ మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అతి త్వరలో ఈ చిత్రం యొక్క షూటింగ్ ను పూర్తి చేసి చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేయనున్నారు. ఇక ఇంతకుముందు రామ్ చరణ్ నటించిన ‘ఎవడు, నాయక్’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాదించాయి. మరి ఈ చిత్రం తో చరణ్ సంక్రాంతి పోరులో హ్యాట్రిక్ విజయాన్ని సాదిస్తాడో లేదో చూడాలి.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు