‘వినయ విధేయ రామ’కు థియేటర్లు పెరుగుదల !

Published on Jan 15, 2019 9:42 pm IST

‘ధృవ’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ మొట్ట మొదటిసారి ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన మాస్ ఎంటర్ టైనర్ ‘వినయ విధేయ రామ’. జనవరి 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, మొదటి రోజే ఏకంగా 26కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి.. బాక్సాఫీస్ వద్ద ఇంకా డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది.

పైగా పండుగ సీజన్ కూడా కావడంతో ఈ చిత్రం కొన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ ను సాధిస్తుండటం విశేషం. దాంతో మండపేట, అనంతపూర్, ఈస్ట్ గోదావరిలతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని ఏరియాల్లో ‘వినయ విధేయ రామ’కు థియేటర్లు మరియు షోల సంఖ్యను పెంచారు.

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ‘జీన్స్’ ఫెమ్ ప్రశాంత్, అలాగే మాజీ హీరోయిన్ స్నేహ, మరియు ఆర్యన్ రాజేష్ లాంటి నటీనటులు నటించన ఈ చిత్రం భారీ అంచనాలు మధ్య విడుదలై.. ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.

పైగా ఎప్పుడూ లేనంతగా ‘వినయ విధేయ రామ’ పై, ఈ చిత్ర దర్శకుడు బోయపాటి పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా మనిషి తలలను గ్రద్దలు ఎత్తికెళ్లిపోయే లాంటి సన్నివేశాల పై నెటిజన్లు బ్యాడ్ గా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి బోయపాటికి ఈ చిత్రం బ్యాడ్ ఎక్స్ పిరియన్స్ ని మిగిలించిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

X
More