శంకర్ తో సినిమా చేయడానికి నేను రెడీ – ఆర్నాల్డ్

శంకర్ తో సినిమా చేయడానికి నేను రెడీ – ఆర్నాల్డ్

Published on Sep 16, 2014 11:34 AM IST

arnold
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ శంకర్ – విక్రమ్ కాంబినేషన్లో బడ్జెట్ మూవీ ‘ఐ’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్, సూపర్ స్టార్ రజినీకాంత్, పునీత్ రాజ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

ఈ వేడుకలో ఆర్నాల్డ్ మాట్లాడుతూ ‘శంకర్ గనుక అవాకశం ఇస్తే అతని దర్శకత్వంలో నటించడానికి నేను సిద్దమే. చెప్పాలంటే నేను ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా రాలేదు, శంకర్ వద్ద అవకాశం కోసం వచ్చాను. శంకర్ డైరెక్షన్ లో నాకు నటించాలని ఉంది. ‘కెనాన్ బిక్కింగ్’ లాంటి సినిమా మనం ఎందుకు ట్రై చెయ్యకూడదని’ అన్నాడు.

రజినీకాంత్ మాట్లాడుతూ ‘చూస్తుంటే శంకర్ కన్ను హాలీవుడ్ పై పడినట్టు ఉంది. ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమాని తీసినట్టు ఉన్నాడు. ప్రతి ఫ్రేం హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉంది. ఒక సినిమా కోసం ఇంతలా కష్టపడే విక్రమ్ లాంటి నటుడు ఇండియాలోనే కాక్డు హాలీవుడ్ లో కూడా ఉండడని’ రజినీ అన్నాడు..

తాజా వార్తలు