ఆ బాలీవుడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని ఉంది – నాగ చైతన్య

ఆ బాలీవుడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని ఉంది – నాగ చైతన్య

Published on Nov 29, 2023 2:41 AM IST


యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ యాక్షన్ వెబ్ సిరీస్ దూత డిసెంబర్ 1న ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకి రానుంది. తొలిసారిగా తాను దీని ద్వారా వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తుండడం మంచి ఎక్స్ పీరియన్స్ అని, అలానే దర్శకడు విక్రమ్ దూత ని అద్భుతంగా తెరకెక్కించారని తాజాగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ నాగచైతన్య అన్నారు.

ఇక ప్రస్తుతం చందూ మొండేటి తో తెరకెక్కుతున్న తండేల్ మూవీ కూడా అద్భుతంగా తెరకెక్కుతోందని తెలిపారు. ఇక తనకు బాలీవుడ్ లో అయాన్ ముఖర్జి, సంజయ్ లీల భన్సాలీ, రోహిత్ శెట్టి, అనురాగ్ కశ్యప్ వంటి వారితో వర్క్ చేయాలని ఉందని ఆయన అన్నారు. అలానే ముఖ్యంగా సంజయ్ లీల భన్సాలీ మూవీస్ అంటే తనకు ఇష్టం అని తెలిపారు. ఇక అయాన్ తీసిన వేక్ అప్ సిద్ మూవీ తనకు ఫేవరెట్ అని అన్నారు. ఇక రోహిత్ శెట్టి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎంతో బాగుంటుందని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు