తారక్ పై కావాలనే నెగిటివ్ చేస్తున్నారా?

తారక్ పై కావాలనే నెగిటివ్ చేస్తున్నారా?

Published on May 23, 2024 8:00 AM IST

పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఆఫ్ లైన్ లో సహా ఆన్లైన్ లో కూడా భీభత్సమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి అలా తన ఎక్స్ ఖాతా(ట్విట్టర్) లో అయితే మన టాలీవుడ్ హీరోస్ లో తన అకౌంట్ కి కూడా సాలిడ్ రీచ్ ఉంది. కాకపోతే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పెట్టిన “దేవర” (Devara) ప్రోమో విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

ఈ పోస్ట్ కి చాలా త్వరగానే లక్ష లైక్స్ దాటేశాయి. కానీ ఇది కాస్తా తర్వాత 60 వేలకి పడిపోయింది. దీనితో ఇదెలా అనే సందేహం మొదలైంది. ముందు అదంతా బాట్స్ మూలానే అని అందుకే తర్వాత ఎక్స్ వాళ్ళు వాటిని తొలగించారు అని టాక్ వచ్చింది. కానీ ఇది మాత్రం తారక్ పై కావాలని చేసిందే అంటూ ఇంకో వెర్షన్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

తారక్ పై కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని ఓ వర్గం చూస్తుంది అని వారే థర్డ్ పార్టీగా ఆ పోస్ట్ కి బాట్స్ తో లైక్స్ కొట్టించారని అంటున్నారు. తీరా అవి తొలగి పోయాక ఈ నెగిటివ్ అంతా ఎన్టీఆర్ మీదకు వచ్చేలా చేశారట. అయితే ఇది మన టాలీవుడ్ హీరోస్ లో మొదటి సారి కాదు గతంలో కూడా ప్రభాస్ (Prabhas) పైన ప్రభాస్ చిత్రాలపై కూడా ఓ వర్గం అది కూడా నార్త్ సైడ్ నుంచి కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు