‘వార్ – 2’ : పక్కా ప్లాన్ ప్రకారమే ఆ రిలీజ్ డేట్ లాక్ చేసారా ?

‘వార్ – 2’ : పక్కా ప్లాన్ ప్రకారమే ఆ రిలీజ్ డేట్ లాక్ చేసారా ?

Published on Nov 30, 2023 2:48 AM IST


బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించనున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందనుండగా ఆదిత్య చోప్రా ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఇక ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని 2025 ఆగష్టు 14 గా నిన్న అనౌన్స్ చేసారు మేకర్స్. 2019 లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన వార్ మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

విషయం ఏమిటంటే, నిజానికి ఈ డేట్ పక్కాగా ప్లానింగ్ ప్రకారం లాక్ చేశారట మేకర్స్. ఆగష్టు 14 రిలీజ్ డేట్ కాగా తరువాతి రోజు స్వాతంత్య్ర దినోత్సవం, ఆగష్టు 16 జన్మాష్టమి, ఆగష్టు 17 ఆదివారం, ఆ తరువాత ఆగష్టు 22 – 24 వరకు రెండవ వీకెండ్, ఆగష్టు 27 న వినాయకచవితి, ఆగష్టు 29-31 వరకు మూడవ వీకెండ్, సెప్టెంబర్ 4 ఈద్, సెప్టెంబర్ 5 ఓనం, సెప్టెంబర్ 6 -7 నాలుగవ వీకెండ్. మొత్తంగా దీని ప్రకారం చాలా వరకు సినిమాకి ఇవి మంచి అడ్వాంటేజ్ కానున్నాయి. ఒకవేళ వార్ 2 మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ లభిస్తే ఆయా రోజుల్లో మూవీకి ఎంతో భారీ స్థాయి కలెక్షన్స్ లభించే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు