‘వార్ 2’ లేటెస్ట్ అప్ డేట్

‘వార్ 2’ లేటెస్ట్ అప్ డేట్

Published on Feb 15, 2024 9:02 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల తొలి కాంబినేషన్లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ వార్ 2. ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న వార్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న దీనిని అయాన్ ముఖర్జీ తెరకెక్కించనుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ పై ఆదిత్య చోప్రా భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ యొక్క సెట్స్ లో మరొక వారం రోజుల అనంతరం హృతిక్ రోషన్ జాయిన్ కానున్నట్లు లేటెస్ట్ బాలీవుడ్ బజ్. మొదట హృతిక్ ఇంట్రడక్షన్ సీన్స్ తీసిన అనంతరం, అక్కడి నుండి వేగంగా షూటింగ్ జరుపనున్నారట. రెండు షెడ్యూల్స్ అనంతరం సెట్స్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారట. అన్నివర్గాల ఆడియన్స్ తో పాటు ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్ ని సైతం ఈ భారీ యాక్షన్ మూవీ ఎంతో ఆకట్టుకుంటుందని అంటోంది టీమ్. త్వరలో ఈ క్రేజీ మూవీ గురించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు