వార్ దూకుడు తగ్గట్లేదుగా ?

Published on Oct 13, 2019 11:00 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ ‘వార్’. కాగా విడుదలైన మొదటి రోజునుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. శనివారం నాడు రూ 11.80 కోట్లు రాబట్టి రూ 257 కోట్ల మార్క్‌ ను అధిగమించింది. ఇక ఎలాగూ ఆదివారం సెలవు కావడంతో ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

కాగా దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. హిందీ, తమిళ్‌, తెలుగు భాషల్లో 4000 స్క్రీన్‌ లలో విడుదలైన ఈ సినిమాలో హృతిక్‌, టైగర్‌ ల మాస్ యాక్టింగ్ తో పాటు వాణీకపూర్‌ తన గ్లామర్ ఆకట్టుకుంది. మొత్తానికి చాల సంవత్సరాల తరువాత సూపర్ స్టార్ గా హృతిక్ రోషన్ తన సత్తా ఏమిటో చూపించాడు.

సంబంధిత సమాచారం :

X
More