మూడువారాలు అవుతున్న వసూళ్ళ జోరు తగ్గలేదు.

మూడువారాలు అవుతున్న వసూళ్ళ జోరు తగ్గలేదు.

Published on Oct 26, 2019 2:01 AM IST

war1

ఈ ఏడాది బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ నమోదయ్యాయి. వాటిలో నంబర్ వన్ గా నిలిచింది వార్ మూవీ. ఇప్పటికే 300కోట్ల వసూళ్ల మార్కును దాటేసిన ఈ చిత్రం విడుదలై మూడు వారాలవుతున్నా వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. నిన్న గురువారం కూడా వార్ చిత్రం 1.5 కోట్ల వసూళ్లు సాధించడం గమనార్హం. పెద్ద చిత్రాల ఏవి విడుదల కాకపోవడం ఈ చిత్ర వసూళ్లకు అడ్డుకట్ట పడలేదు. హిందీలో 295కోట్లు కొల్లగొట్టిన వార్, తెలుగు, తమిళ భాషలలో కలిపి 309 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఐతే నేడు బాలీవుడ్ లో దాదాపు నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 4 మరియు మేడ్ ఇన్ చైనా, సాండ్ కి ఆంఖ్, జిందగీ తుమ్ సే చిత్రాలు విడుదలయ్యాయి. కాబట్టి వార్ వసూళ్లు బాలీవుడ్ లో ముగిసినట్టే చెప్పాలి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు