ప్రభాస్ కి పోటీవస్తున్న వార్నర్

Published on May 28, 2020 1:07 pm IST

కొద్దిరోజులుగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోలతో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన టాలీవుడ్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ మరియు బన్నీ వంటి హీరోల సాంగ్స్ మరియు డైలాగ్స్ కి టిక్ టాక్ చేస్తుంటే సదరు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రికెటర్ వలన మన హీరోలకు ఇంటర్నేషనల్ ఐడెంటిటీ కూడా వచ్చి చేరుతుంది. ఐతే ఈ సారి వార్నర్ ప్రభాస్ తో ఓ విషయంలో పోటీకి వచ్చాడు.

బాహుబలి చిత్రంలోని ప్రభాస్ ఫొటో పక్కన ఆయన ఫోటో పోస్ట్ చేసి ఎవరి కాస్ట్యూమ్ బాగుంది అని నెటిజెన్స్ కి పోల్ పెట్టాడు. వార్నర్ సైతం వారియర్ కాస్ట్యూమ్స్ ధరించి ఉండగా నెటిజెన్స్ ఆ ప్రశ్నకు బాగా స్పందిస్తున్నారు. కొందరు వార్నర్ కి ఓటేస్తుంటే చాలామంది ప్రభాస్ కి ఓటేస్తున్నారు. ఇది జస్ట్ ఫన్ కోసం వార్నర్ చేయగా నెటిజెన్స్ మాత్రం సీరియస్ గా ఓటింగ్ లో పాల్గోంటున్నారు. క్రికెటర్ గా క్రికెట్ అభిమానులకే తెలిసిన వార్నర్ ఈ వీడియోల దెబ్బతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు.

సంబంధిత సమాచారం :

More