బిగ్ బాస్ కొత్త హోస్ట్ పై ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటీ ?

బిగ్ బాస్ కొత్త హోస్ట్ పై ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటీ ?

Published on Sep 2, 2019 7:28 PM IST

గత వారం అనుకోని అతిథిలా రమ్య కృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అటు బిగ్ బాస్ ఇంటి సభ్యులను, ఇటు బిగ్ బాస్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. మాహిష్మతి రాజ్య రాజమాతగా శనివారం రమ్యకృష్ణ ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఇంటి సభ్యులతో ఆమె మాట్లాడిన తీరు, రెండు రోజులు ఆమె షోకి హోస్ట్ గా వ్యవహరించిన విధానం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ వారం బిగ్ బాస్ షో టిఆర్పి రేటింగ్స్ కూడా పెరిగే అవకాశం కలదు.

నాగార్జున జన్మదిన వేడుకలకు స్పెయిన్ వెళ్లడం వలన ఈ అవకాశం దక్కించుకున్న రమ్యకృష్ణ షో హోస్ట్ గా అదరగొట్టింది. భవిష్యత్తులో పూర్తి స్థాయి బిగ్ బాస్ హోస్ట్ గా అవకాశం దక్కించుకునే అవకాశాలు మెరుగుపరుచుకుంది. బిగ్ బాస్ షో కి లేడీ స్టార్స్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. హిందీలో బిగ్ బాస్ 2 సీజన్ కి శిల్పా శెట్టి హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఆసక్తికరంగా ఈవారం షో నుండి ఎలిమినేషన్ లేకపోవడంతో నామినేషన్స్ లిస్ట్ లో ఉన్న వారు, ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు