‘సైరా’ మేకింగ్ వీడియో’కి టైం ఫిక్స్ !

‘సైరా’ మేకింగ్ వీడియో’కి టైం ఫిక్స్ !

Published on Aug 13, 2019 4:50 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఆగష్టు 14న సాయంత్రం 3 గంటల 45 నిముషాలకు ‘సైరా మేకింగ్ వీడియో’ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాగా సైరా టీమ్ భారీ ఎత్తున ప్రచార ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ ను గ్రాండ్‌ గా విడుదల చేయడానికి చిత్రబృందం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.

ఇక ఈ చిత్రం ట్రైలర్ కోసం అభిమానాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు