సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 12న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే సంచలనాలను సృష్టించిన ఈ సినిమా గురించి నిర్మాత అనిల్ సుంకర మీడియాకి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆర్మీ మేజర్ గా మహేష్ బాబు రోల్ సినిమాలోనే హైలైట్ అవుతుందని, ఆయన అభిమానులను ఆ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుందని అనిల్ సుంకర తెలిపారు. అలాగే ఈ సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆయన కామెడీ టైమింగ్ పూర్తిగా కొత్తగా ఉంటుందని ఈ స్టార్ ప్రొడ్యూసర్ వెల్లడించారు.
కాగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


