
బాండ్ ‘జేమ్స్ బాండ్’ అంటూ త్వరలో మనముందుకు రానున్నాడు టాలీవుడ్ అల్లరోడు అల్లరి నరేష్. కానీ హాలీవుడ్ జేమ్స్ బాండ్ స్టన్నింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, విజువల్స్ తో మెప్పిస్తే ఈ జేమ్స్ బాండ్ మాత్రం థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడట. అందుకే టైటిల్ లోనే జేమ్స్ బాండ్ తను కాదని ‘నేను కాదు నా పెళ్ళాం’ అనే ట్యాగ్ లైన్ ని పెట్టారు. ఈ సినిమా ఈ శుక్రవారం అనగా జూలై 24న ప్రేక్షుకల ముందుకు రానుంది.
బాహుబలి కలెక్షన్స్ జోరు ఇంకా ఆగలేదు ఈ టైంలో జేమ్స్ బాండ్ రిలీజ్ కరక్టే అంటారా అని అల్లరి నరేష్ ని అడిగితే ‘ బాహుబలి అనేది చాలా గొప్ప మూవీ. ప్రప్రంచ సినిమా రంగాన్ని మనవైపు చూసేలా చేసింది. దానికి మా సినిమాకి పోలికేంటి. ఇది కామెడీ సినిమా, దీనికుండే ప్రేక్షకులు దీనికి ఉంటారు. వేసవి తర్వాత వస్తున్న మొదటి కామెడీ సినిమా ఇదే.. సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది. బాహుబలి చూసినప్పుడు నాకు ఓ కామెడీ రోల్ క్రియేట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది కానీ ఆ వక్షం ఉంటే రాజమౌళి గారే పిలిచే వారు కదా అని’ అనుకొని ఊరుకున్నాను. అల్లరి నరేష్ – సాక్షి చౌదరి జంటగా నటించిన జేమ్స్ బాండ్ సినిమాకి సాయి కిషోర్ డైరెక్టర్.

