ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా చీలిపోవడంతో తెలుగు సినిమా రంగంకూడా రెండు విభిన్న పార్శ్వాలుగా విడిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగంలో అత్యధిక ప్రతిభ కనబరిచిన టెక్నీషియన్లకు నంది అవార్డ్స్ ని ప్రధానం చేస్తుంది. అయితే ఈసారి తెలంగాణా ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డ్స్ కి పేరు మారుస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
ఇప్పటికే మూడు పేర్లు పరిశీలనలో వున్నట్టు, వాటిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒకటి ఖరారు చేస్తే ఇక మీదట ఆ పేరుతో సినిమావారికి ఆ అవార్డు ఇవ్వనున్నట్టు తెలిపారు. సోమవారం నాడు సినీ ప్రముఖులు కె.ఎస్. రామారావు, దగ్గుబాటి సురేష్ వంటి దిగ్గజాలు తలసాని యాదవ్ ని కలిశారు.


