సూపర్ స్టార్ బర్త్ డే ట్రీట్ అదేనా…?

rajinui

సూపర్ స్టార్ రజిని కాంత్ అభిమానులకు డిసెంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. స్టైల్ ఐకాన్ తమ ఆరాధ్య నటుడు తలైవా పుట్టిన రోజు డిసెంబర్ నెలలో ఉండటమే దీనికి కారణం. 12-12-1950న రజని జన్మించడం జరిగింది. దీనితో తన పుట్టిన రోజు కానుకగా రజిని తన అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.ఐతే ప్రస్తుతం ఆయన నటిస్తున్న దర్బార్ మూవీ టీజర్ ఆరోజు విడుదల చేయనున్నారని సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ విడుదలకు తలైవా పుట్టిన రోజు పర్ఫెక్ట్ సిచ్యువేషన్ గా చిత్ర బృందం భావిస్తున్నారట. అందుకే దీనిపై దర్శకుడు మురుగదాస్ అప్పుడే కసరత్తు మొదలుపెట్టేశారట.

చాలా కాలం తరువాత దర్బార్ మూవీలో రజిని పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. తెరపై ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్, మెస్మరైజింగ్ స్టయిల్స్ తో దుమ్మురేపనున్నారు. ముంబై మాఫియా పై పోరాడే పోలీస్ గా రజిని కనిపిస్తుండగా చిత్రీకరణ దాదాపు ముంబైలో జరిపారు. ఇక ఈ చిత్రంలో నయనతార రజిని కి జంటగా నటిస్తుంది. అనిరుధ్ స్వరాలు అందిస్తుండగా, ఇటీవల విడుదలైన దుమ్ము, ధూళి సాంగ్ బాగా ఆకట్టుకుంది.

Exit mobile version