NBK 111: బాలయ్య భారీ చిత్రం పరిస్థితి ఏంటి?

NBK111

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రమే ‘అఖండ 2 తాండవం’. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఊహించిన రీతి విజయాన్ని అందుకోలేదు. అయితే ఇది స్యూర్ షాట్ హిట్ అవుతుంది అనే భావనలో ఇది రిలీజ్ కి ముందే దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య తన కెరీర్ భారీ చిత్రాన్ని తన కెరీర్ 111వ (NBK 111) సినిమాగా అనౌన్స్ చేశారు.

ఇందులో కూడా బాలయ్య మళ్ళీ డబుల్ రోల్ పైగా వారియర్ గా కనిపిస్తారు అనేది కన్ఫర్మ్ అయ్యింది. అంతే కాకుండా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసిన ఈ సినిమాలో నయనతార కూడా అని అనౌన్స్ చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని వార్తలు సినీ వర్గాల్లో ఈ మధ్య వైరల్ గా మారాయి.

ప్రస్తుతం సినిమా కథనే మార్చినట్టు వినిపిస్తుండగా కొత్తగా అయితే ఇది కాకుండా బాలయ్య మరో సినిమా ముందు చేస్తారు అంటూ షాకింగ్ రూమర్ మొదలైంది. మరో ప్రముఖ దర్శకుడు రేస్ లోకి వచ్చాడు అంటూ వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని వినిపిస్తుంది. గోపీచంద్ తో సినిమా మొదలయ్యేందుకు కొంచెం సమయం పడుతుంది తప్పితే సినిమా అయితే ఆగిపోలేదట. సో ఈ క్రేజీ కలయికలో సినిమా ఉంటుందనే చెప్పొచ్చు.

Exit mobile version