యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొద్ది రోజుల క్రితం టిడిపికి సపోర్ట్ చేస్తున్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. అలాగే మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ ప్రచారానికి కూడా రూట్ మ్యాప్ రెడీ అవుతోందని తెలిపారు. కానీ ఇవేమీ జరగలేదు.
ఉన్నట్టుండి ఒక్కసారిగా తారక్ క్యాంపు మొత్తం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ అయిపొయింది. దాంతో తారక్ తన తాతగారు స్థాపించిన పార్టీ తరపున ప్రచారం చేస్తాడా లేదా అన్ని విషయంపై క్లారిటీ లేకపోయింది. ప్రస్తుతం తారక్ ఫాన్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం తారక్ ఫ్యామిలీలోని కొంతమందికి ప్రచారానికి తారక్ రావడం ఇష్టం లేదని అంటున్నారు.
ఎన్.టి.ఆర్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు గనుక తారక్ పార్టీ తరపున ప్రచారం చేయకపోతే నందమూరి ఫాన్స్ కి తను దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ టిడిపి తరపున ప్రచారం చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో ఎన్.టి.ఆర్ తీసుకోబోయే నిర్ణయం చాలా కీలకం కానుంది.
ఇక్కడ అందరికీ తెలిసిన నిజం ఏమిటంటే నందమూరి ఫ్యామిలీలో స్ట్రాంగ్ స్పీచ్ ఇవ్వగల వక్త మాత్రం తారక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టిడిపి కష్టతర పరిస్థితిలో ఉన్నప్పుడు అతని స్పీచ్ పవర్, ప్రజలను అట్రాక్ట్ చేయడం ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు టిడిపి ఈ యంగ్ హీరోని ప్రచారానికి విస్మరిస్తుందా?
అలాగే తారక్ కూడా అందరినీ వ్యతిరేఖించి పార్టీ తరపున ప్రచారానికి వస్తాడా? లేక సైలెంట్ గా సినిమాలు చేసుకుంటాడా? అసలు ఎన్.టి.ఆర్ ప్రచారానికి అడ్డుపడుతున్నదెవరు? ఈ ప్రశ్నలకి ప్రస్తుటానికి సమాధానం లేదు.


