
డార్లింగ్ హీరో ప్రభాస్ ఇప్పుడు మొత్తం మూడు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో “రాధే శ్యామ్” ఒకటి. దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూట్ కూడా ఇటీవలే ఫారెన్ లో షూట్ ను ప్రారంభించుకుంది. అయితే భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం స్వచ్ఛమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కుతుంది.
ఇక ఈ చిత్రంకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికపుడు వస్తున్న క్రమంలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇదొక అధికారిక అప్డేట్ ఉంటుంది అన్ని తెలిసింది. అయితే దాదాపు ఆరోజున రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ వస్తుంది అని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం మేకర్స్ దృష్టిలో టీజర్ కూడా ఉన్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
దీనితో ప్రభాస్ పుట్టినరోజుకు కేవలం మోషన్ పోస్టర్ నే ప్లాన్ చేసారా లేక టీజర్ నే ప్లాన్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు ఇవ్వబోయే అప్డేట్ ఏమిటా అన్నది మంచి ఆసక్తికరంగా మారింది.