“ఓజి” రిలీజ్ పరిస్థితి ఏంటి?

“ఓజి” రిలీజ్ పరిస్థితి ఏంటి?

Published on May 19, 2024 6:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా మిగిలిన షూట్ ఇంకా రానున్న రోజుల్లో పూర్తి కానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఎప్పుడో అనౌన్స్ చేసేసారు కానీ దీనితో ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27 కి రానుంది అని చెప్పారు.

కానీ ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న వాటితో ఓజి ఆ డేట్ లో డౌట్ అనే అంటున్నారు. దీంతో ఈ డేట్ ని క్యాచ్ చేయడానికి చాలా సినిమాలే చూస్తున్నట్టుగా కూడా వార్తలు మొదలయ్యాయి. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర (Jr NTR Devara) గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ (Ram Charan Game Changer) లు కూడా ఈ డేట్ కోసం చూస్తున్నాయని టాక్ వచ్చింది.

దీనితో ఓజి అదే డేట్ లో వస్తుందో లేదో అనేది రీకన్ఫార్మ్ కావాల్సి ఉంది. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు