భారీ సినిమాల పరిస్థితి ఏమిటి ?

Published on May 26, 2020 3:00 am IST

కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయిపోయాయి. పెద్ద సినిమాలకు సమ్మర్ బాగా కలిసి వచ్చే అంశం. ఇక సమ్మర్ సీజన్ తరువాత ముఖ్యమైన సీజన్ అంటే దసరానే. విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు పోటీకి సిద్దమవుతాయని అందరూ అనుకున్నారు. కానీ సమ్మర్ సీజన్ లాగే, ఇప్పుడు దసరా సీజన్ కూడా మిస్ అయ్యేలా కనిపిస్తోంది.

అక్టోబర్ నాటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ తగ్గితే దసరాకి భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. చిరు ‘ఆచార్య’, రజనీ ‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’ అలాగే కంగనా ‘తలైవి’, నితిన్ ‘రంగ్ దే’ వరుణ్ తేజ్ ‘బాక్సర్’ మూవీ ఇంకా అప్పటికీ కొన్ని సినిమాలు రేసులోకి ఉన్నాయి.

కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే పెద్ద సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి ‘ఆచార్య’, రజనీ మూవీ అలాగే ‘కె.జి.ఎఫ్ 2’ దసరాకి రావాలంటే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయాల్సి ఉంది. మరి భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ అంటే కరోనా కాలంలో కష్టమే.

సంబంధిత సమాచారం :

More