‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ పరిస్థితి ఏమిటి ?

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ పరిస్థితి ఏమిటి ?

Published on Apr 11, 2021 1:00 AM IST

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా పోస్ట్ ఫోన్ అవ్వక తప్పదా ? ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ తో సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతోన్న నేపథ్యంలో ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ కూడా మారే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా నటిస్తున్నారు. అదేవిధంగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటి సారి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి ఇండియా వైడ్ గా బజ్ ఉంది.

ఇక దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ కాబట్టి, ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రాకపోవచ్చు. అందుకే ఈ సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి బయ్యర్లు వెనుకాడటం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు