వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ లో హీరోయిన్ రాశి ఖన్నాను చూసిన అభిమానులు ముక్కున వేలువేసుకున్నారు. కెరీర్ బిగినింగ్ నుండి స్కిస్ షోకి దూరంగా గ్లామర్ రోల్స్ చేయని రాశి.. వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ లో టాప్ లెస్ గా కనిపించడంతో పాటు… విజయ్ దేవరకొండతో బోల్డ్ సన్నివేశాలలో కనిపించింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో చేసినప్పుడు కూడా రాశి ఎక్స్పోసింగ్ విషయంలో హద్దులు మీరింది లేదు. అలాంటిది ఆమె కెరీర్ గాడిన పడుతున్న సమయంలో ఇలాంటి రోల్ చేయడం ఏమిటనిపించింది.
గత ఏడాది ఆమె నటించిన వెంకీ మామ హిట్ కాగా ధరమ్ తేజ్ తో చేసిన ప్రతిరోజూ పండగే సూపర్ హిట్ గా నిలిచింది. రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఆమెకు మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం కలదు. ఐతే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఆమె పాత్ర మరీ బోల్డ్ గా ఉంటే కొన్ని పాత్రలకు ఆమెను దర్శకులు ప్రిఫర్ చేయరు. ముఖ్యంగా స్టార్ హీరోలు బోల్డ్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ ని జంటగా పెట్టుకోవడానికి ఇష్టపడరు. మరి ఇలాంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో రాశి ఎందుకు బోల్డ్ రోల్ చేయడానికి అంగీకరించింది అనేది ప్రశ్న.
ఐతే వెంకీ మామ, ప్రతి రోజూ పండగే చిత్రాలు లేటెస్ట్ గా విడుదలై విజయం సాధించినవి. వీటికి ముందు టాలీవుడ్ లో ఆమెకు గొప్ప ఆఫర్స్ ఏమీలేవు. ఆ సమయంలో ఒప్పుకున్నదే ఈ వరల్డ్ ఫేమస్ లవర్. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ కి ఆమె టెంప్ట్ అయ్యి వెనుకా ముందు ఆలోచించకుండా ఈ రోల్ కి ఒకే చెప్పి ఉంటుంది. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ విజయం సాధించక పోయినా… రాశి రోల్ నటనకు ప్రాధాన్యం లేకుండా మసాలా సన్నివేశాలకే పరిమితమైనా.. ఆమె కెరీర్ ప్రమాదంలో పడ్డట్టే.


