గతేడాది ‘సింగిల్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు, ఇటీవల వారం రోజుల వ్యవధిలో ‘విష్ణు విన్యాసం’, ‘మృత్యుంజయ్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి చివరలో విడుదలైన ‘విష్ణు విన్యాసం’ కనీస ఓపెనింగ్స్ రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
మార్చి మొదటి వారంలో విడుదలైన ‘మృత్యుంజయ్’కు మొదట మెరుగైన స్పందన వచ్చినప్పటికీ, ఆదివారం నాటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ప్రభావంతో వసూళ్లు తగ్గాయి. సోమవారం నాటికి కలెక్షన్స్ పూర్తిగా పడిపోవడంతో ఈ సినిమా కూడా నిరాశపరిచింది.
ఈ రెండు సినిమాల్లో శ్రీవిష్ణు నటనకు ప్రశంసలు దక్కినప్పటికీ, ఫలితం మాత్రం ఆశించినట్లు లేదు. వారం వ్యవధిలో రెండు సినిమాలను విడుదల చేసే రిస్క్ చేసినా, అవి బ్యాక్-టు-బ్యాక్ పరాజయాలుగా మిగిలిపోయాయి. మరి నెక్స్ట్ చిత్రంతో శ్రీ విష్ణు ఎలాంటి స్ట్రాటజీతో వస్తాడో చూడాలి.
