ఈ కన్నడ హీరో సినిమాకు ఏమవ్వుద్దో.?

Published on Mar 9, 2021 8:03 am IST

ఇప్పుడు చెందిన సినిమాను అయినా సరే మన తెలుగు వారు ఆదరించినట్టుగా ఏ ఇండస్ట్రీలో కూడా ఆదరించరు అనేది కూడా వాస్తవం. ఇది మన తెలుగు సినిమాపై కాస్త అవగాహన ఉన్నవారికి అయినా తెలుస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఓ కన్నడ స్టార్ హీరో సినిమా విషయంలో సోషల్ మీడియాలో ఎందుకో సడెన్ గా గట్టి రచ్చే లేస్తుంది. కేజీయఫ్ సినిమాతో యష్ మన దగ్గర మంచి క్రేజ్ ను తెచుకున్నాడు.

అలాగే పునీత్ రాజ్ కుమార్ కూడా ఇక్కడ తన “యువరత్న” సినిమాతో ఎంట్రీకి రెడీగా ఉన్నాడు. అయితే వీరిద్దరి తర్వాత తెలుగు మార్కెట్ లోకి రావడానికి రెడీ అయ్యిన మరో స్టార్ హీరో దర్శన్. తాను లేటెస్ట్ గా చేసిన కన్నడ చితం “రాబర్ట్”తో తెలుగు ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా విషయంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అతను రాజమౌళి చేసిన తెలుగు సినిమా గర్వించదగ్గ “బాహుబలి” సినిమాను డీగ్రేడ్ చేస్తూ మాట్లాడాడని అంతే కాకుండా రాజమౌళిపై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసాడని వీడియోస్ వైరల్ అవుతున్నాయి.అలాగే అవన్నీ ఫేక్ వీడియోస్ అని దర్శన్ ఇచ్చిన మొత్తం ఇంటర్వూస్ చూడాలని అతని అభిమానులు మరో వెర్షన్ తో డిఫెండ్ చేస్తున్నారు. దీనితో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా విషయంలో ఎంత వరకు ఆదరిస్తారో అని టాక్ మొదలయ్యింది. మరి ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :