చిరంజీవికి మోహన్ బాబు అంటే ఇంతటి అభిమానమా?

చిరంజీవికి మోహన్ బాబు అంటే ఇంతటి అభిమానమా?

Published on Jan 2, 2020 1:27 PM IST

chiru

నేడు మా అసోసియేషన్ వేదికగా అరుదైన సంఘటన ఆవిష్కృతం అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని ఆలింగనం చేసుకోవడంతో పాటు, ఆయనను ముద్దుపెట్టుకున్నారు. నేడు మా అసోసియేషన్ డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిధులుగా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు హాజరయ్యారు. మా అసోసియేషన్ ముఖ్య సభ్యులు రాజశేఖర్, జీవిత, నరేష్ వారిని సాదరంగా ఆహ్వానించారు.

ఈ సంధర్భంగా మోహన్ బాబు చిరంజీవితో తనకు గల అనుభందం, వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడారు. దీనికి స్పందనగా చిరంజీవి మోహన్ బాబుని కౌగిలించుకోవడంతో పాటు, ఆయనకు ముద్దు పెట్టారు. అలాగే చిరంజీవి మా అసోసియేషన్ సభ్యులను వారి కార్యాచరణను ఉద్దేశిస్తూ ‘మంచి ఉంటే మైక్ లో చెప్పండి.. చెడు అయితే చెవిలో చెప్పండి..’ అని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు