బన్నీతో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ !

Published on Sep 27, 2020 3:12 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప’ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఊర్వశి రౌటెలా బన్నీ సినిమాలో చేయబోతున్నానని ట్వీట్ చేసింది. ఆమె పోస్ట్ చేస్తూ..’డాన్స్ లో నా ప్రేరణ అల్లు అర్జున్ తో నటించబోతున్నా. పుష్ప సినిమాలో నా సౌత్ ఇండియన్ డాన్స్ స్టైల్ ని మీకు చూపించబోతున్నాను’ అంటూ ఊర్వశి రౌటెలా డాన్స్ కి సంబధించిన వీడియోను పోస్ట్ చేసింది.

ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇక ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. అలాగే ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో స్మగ్లింగ్ సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More