ప్రభాస్-సుజిత్‌ల సినిమా ఎప్పుడు?

ప్రభాస్-సుజిత్‌ల సినిమా ఎప్పుడు?

Published on Jun 15, 2015 8:14 PM IST

prabhas-sujith
‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోయే కొత్త సినిమా ఏమిటన్న విషయం అందరికీ తెలిసిందే. ‘మిర్చి’ సినిమా తర్వాత తన రెండేళ్ళ సమయాన్ని ప్రతిష్టాత్మక ‘బాహుబలి’ చిత్రానికే కేటాయించిన ప్రభాస్, మళ్ళీ ఇన్నేళ్ళకు కొత్త సినిమాకు పంచ జెండా ఊపారు. ‘రన్ రాజా రన్’ ఫేం సుజీత్‌తో కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న విషయం ఇంతకుముందే తెలియజేశాం. మే నెల్లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందనే ప్రచారం జరిగినా అది ప్రచారంగానే మిగిలిపోయింది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ‘బాహుబలి’ పూర్తయ్యాకే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని తెలుస్తోంది. ‘బాహుబలి’ మొదటి భాగం జూలై 10న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే! అదే విధంగా ‘బాహుబలి’ రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొంత పూర్తి కావాల్సి ఉంది. బాహుబలి రెండో పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ప్రభాస్ కొత్త సినిమా మొదలుపెట్టనున్నారట. సుజీత్ ప్రభాస్ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు